19 August, 2026 | 3:10 AM

23న జరగనున్న బంగారు మైసమ్మ బోనాలపై సమీక్ష

19-08-2026 01:19 AM

మేడిపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి):  మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని బోడుప్పల్ లోఈ నెల 23న జరగనున్న బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను కోరారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్య క్రమంలో పొగుల నర్సింహారెడ్డి, బొమ్మక్ కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, పొగుల దిలీప్ రెడ్డి, రసాల వెంకటేష్ యాదవ్, ధనగళ్ల యాదగిరి, చిరాల నర్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు. ఆలయ నిర్వాహ కులు తదితరులు పాల్గొన్నారు.