నిన్ను ఎట్టా సెక్కాడే దేవుడు..
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూ రు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో గీతం ‘ఎట్టా ఎట్టా..’ విడుదలైంది.
‘రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప మూయాలనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవ్వరు అనిపిస్తలే.. నడుమేమో జానెడు జానెడు.. ఆ జడ చూస్తే బారెడు బారెడు.. తల్లో మడిసి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు.. నిన్ను ఎట్టా సెక్కాడే దేవుడు... ఎట్టా ఎట్టాగా ఓలమ్మి.. ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టా ఎట్టాగా..’ అంటూ సాగుతోందీ గీతం. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను స్వరపర్చడమే కాక శ్రీకృష్ణతో కలిసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు.






