బాలల హక్కులను పరిరక్షించాలి
10-12-2024 06:50 PM
జిల్లా న్యాయమూర్తి రమేష్...
పటాన్ చెరు: బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయమూర్తి రమేష్ అన్నారు. అంతర్జాతీయ పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బొల్లారం మున్సిపల్ లోని మోడల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అమ్మాయిలకు ఎలాంటి లీగల్ సమస్యలున్న 15100 కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, పారా లీగల్ మండల వాలెంటర్ శారద, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






