14 July, 2026 | 11:10 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

పాటల పల్లకిని విజయవంతం చేద్దాం

26-06-2025 08:01 PM

ఉద్యోగాలను సాధించుకుందాం 

తెలంగాణ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్..

సిద్దిపేట (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లా పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమానికి సన్నాహక సమావేశాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్(Siddipet Press Club)లో తెలంగాణ ఉద్యమ కవి గాయకులు మద్దెల నర్సింలు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి పల్లె పల్లెల ప్రజలను చైతన్యం చేసి రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన అర్హులైన ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు రాకపోవడం చాలా బాధాకరమని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఉద్యమ కళాకారులకు సారధిలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. 

అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సభను నిర్వహిస్తున్న తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉద్యమ కళాకారులందరూ ఏకతాటిపై కదిలి పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే పాటల పల్లకి కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో టిపిసిసి సాంస్కృతి సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు, తెలంగాణ జానపద కళాకారుల సంఘం సిద్దిపేట అధ్యక్షుడు కళా ప్రసాద్ , ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బండ కాడి గణేష్,ఉద్యమ కళాకారుల సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లిపూర్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల స్వామి, సంగారెడ్డి జిల్లా ఉద్యమ కళాకారుడు ఆరెళ్ళ రాము,కళ్ళెం లక్ష్మణ్,సిరియాల్, ప్రశాంత్, రమేష్, రాకేష్, డప్పు సంపత్ తదితరులు పాల్గొన్నారు.