calender_icon.png 12 November, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో ముందుకెళ్దాం

19-05-2024 02:07:14 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రంగారెడ్డి, మే 18 (విజయక్రాంతి) : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వేళితేనే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రత్యేకంగా విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని మిగతా సమయంలో ప్రజా సమస్యలపైనే ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. ప్రాంత సమస్యలపై తనను ఎవరైనా కలువొచ్చని చెప్పారు. అందరి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదమన్నారు. అంతకు ముం దు ఎంపీటీసీలు తమ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు.

సభ కొనసాగుతుండగానే కొందరూ అధికారులు సభ ఆవరణ నుంచి బయటకు వేళ్లే ందుకు సిద్ధం కాగా ఎమ్మెల్యే వారిని సున్నీతంగా మందలించారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సభకు అధికారులు బాధ్యతగా మొలగాలని సభలు, సమావేశాలు జరిగే సందర్భంలో ఇంటికి వేళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు. మరోకసారి ఇలాంటివి రిపీట్ కావొద్దన్నారు. ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలువురు ఎంపీటీసీలకు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో కొంత భావో ద్వేగానికి గురయ్యారు. అనంతరం సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.