calender_icon.png 12 November, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్ను సమస్యలు పరిష్కరించాలి

19-05-2024 02:06:28 AM

రాజేంద్రనగర్, మే 18 (విజయక్రాంతి) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల విధింపులో తలెత్తుతున్న హెచ్చుతగ్గుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ ఆఫ్ బీజేఎంసీ అధ్యక్షుడు ఎం. సుధాకర్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌బాబు, ఉపాధ్యక్షుడు నదీమ్, వినయ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రమీల తెలంగాణ ముఖ్యమంత్రిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కోరారు. ఈ మేరకు శనివారం వారు రిజిస్టర్ పోస్టును సీఎంకు పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంటి పన్నుకు, రిజిస్ట్రేషన్ విలువకు ముడి పెడు తున్నారన్నారు. స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ ధరలు పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు సైతం మారుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఇంటి పన్నును రిజిస్ట్రేషన్ ధరతో ముడిపెట్టకుండా వార్షిక అద్దె విలువ పద్ధ తిన ఇంటి పన్ను నిర్ధారించాలని కోరినట్లు తెలిపారు. అవసరమైతే ముఖ్య మంత్రిని కలిసి ఇంటి పన్నులు, నీటి సరఫ రా, ఇతర సమస్యలను వివరిస్తామని వెల్లడించారు.