28 March, 2026 | 6:22 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్

16-05-2024 02:26 AM

కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లకు నిర్వ హించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. డీలర్లు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధించిన పురుగు మందులు అమ్మవద్దని సూచించారు.

రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. వ్యవసాయాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో 15 రోజులకొకసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి నామాను జాచార్య, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి, ఏడీఏలు రణధీర్, సునీత, అంజలి, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహేందర్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. 

పదో తరగతి ఫలితాలపై సమీక్ష..

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో పదో తరగతి ఫలితాలపై కలెక్టర్ పమేలా సత్పతి సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 84 పాఠశాలల హెచ్‌ఎంలను  సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, పాఠశాలలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి వారం జిల్లాలో ఒక పాఠశాలను సందర్శిస్తానని పేర్కొన్నారు. కార్యక్ర మంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో జనార్ధన్‌రావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నరసింహస్వామి, ఏఎంవో అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.