12-01-2026 09:54:47 AM
మాజీ మార్కెట్ చైర్ పర్సన్ పులుసు యాదగిరి గౌడ్.
తుంగతుర్తి,(విజయక్రాంతి): అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు పులుసు యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గౌడ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించిన ఆత్మీయ సన్మానంలో పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.
మండలంలో ప్రతి గ్రామంలో నూతనంగా సభ్యత్వ నమోదు తో పాటు సంఘం బలోపేతానికి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు గౌడ సంఘం నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, మాజీ రామాలయ కమిటీ చైర్మన్ పులుసు వెంకటనారాయణ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, తొట్ల సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్య గౌడ్, గుండగాని అంజయ్య గౌడ్, మద్దెల నర్సయ్య గౌడ్, చిర్ర నరేష్ గౌడ్, గుండగాని శ్రీనివాస్ గౌడ్, గుండగాని వీరయ్య గౌడ్, పాలకుర్తి వీరయ్య గౌడ్, కట్ల మల్లయ్య గౌడ్, బత్తుల జలేందర్ గౌడ్, గడ్డం సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ పొదిల యాదగిరి గౌడ్, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు పాల్గొన్నారు.