calender_icon.png 12 January, 2026 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనరావుపేటలో మాల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం

12-01-2026 09:53:25 AM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షులు మాందాల  శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన మాల కుల సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు, సభ్యులకు మాల కుల బాంధవులు ఘనంగా ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కోనరావుపేట మండలంలో వివిధ గ్రామాల నుంచి ఒక మాల సర్పంచ్ 4గురు ఉప సర్పంచ్ లు, 26 మంది వార్డు సభ్యులుగా గెలుపొందడం హర్షనీయమన్నారు. ఇదే దిశగా ముందుకు సాగుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎలక్షన్లో అత్యధిక సీట్లు గెలుపొంది రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తుంగ శివరాజ్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాలుక సత్యం, ఉద్యోగ సంఘాల జిల్లా నాయకులు బుర్కా గోపాల్,జిల్లా సభ్యులు జక్కుల యాదగిరి, అంగూరి సుధాకర్, ఎర్ర ఆగేష్, మండల కమిటీ సభ్యులు ఎడ్ల సుధాకర్, మాదాసు భూమయ్య, కులెరు చంద్రయ్య, కులేరు బాబు, గ్రామ అధ్యక్షులు యాస శ్రీనివాస్, మండలంలోని మాలకుల సంఘ సభ్యులు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.