calender_icon.png 12 January, 2026 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటైనర్ - కారు ఢీ.. పలువురికి గాయాలు

12-01-2026 09:48:41 AM

మునిపల్లి,(విజయక్రాంతి): కంటైనర్, కారు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన ముంబై జాతీయ రహదారిపై ఉన్న లింగంపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ అదే వైపు నుంచి వస్తున్న క్రమంలో మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులోకి రాగానే కంటైనర్ కారును ఢీకొన్నది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయినట్టు తెలిసింది. ఇందుకు  సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.