ఎల్ నినోను ఎదుర్కొందాం
- మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం
- రైతులను, ప్రజలను కాపాడుకుందాం
- ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలి
- తాగునీటి కొరత సమస్యపై ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలి
- ప్రతీనీటిచుక్కను ఒడిసిపడదాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- అందరం భాగస్వాములమై ఎదుర్కొందాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కరీంనగర్, జూలై 19 (విజయక్రాంతి): సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సమిష్ఠిగా ఎదుర్కొని రైతులు, ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మిషన్ మోడ్ లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయ రమణారావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో కలిసి సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..అందరం సమన్వయంతో పనిచేస్తే ప్రకృతి విసరి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందన్నారు.
రైతునేస్తం, గ్రామసభల ద్వారా రైతులకు ముందుగానే పరిస్థితులను వివరించాలన్నారు. తెలంగాణతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటకపై కూడా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటి సమ స్యలు కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు పనిచేయాలన్నారు.
రైతులు తక్కువనీటితో సాగయ్యే పంటల వైపు మొగ్గుచూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందు న్న అతిపెద్ద సవాల్ అని, రాజకీయాలకతీతంగా కలిసి పనిచేస్తూ రైతులను, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.జిల్లాల కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ తో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీ జిల్లాకు ఒక సీనియర్ అధికారిని నియమిస్తున్నామని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆరుతడి పంటలపై రైతుల కు అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్య లు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ.. ప్రతీ వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమం చేపట్టాలని, ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకు డు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారు లు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, మహిళా సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొవాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనాను సమిష్ఠిగా ఎదుర్కొన్నట్లే ఎల్‌నినో సంక్షోభాన్ని కూడా అధిగ మించవచ్చని, అదే స్ఫూర్తి, సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టాలని, ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పంచాయి తీ కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రైతులను,ప్రజలను ఎల్‌నినో నుంచి కాపాడుకోవాలని వివరించారు.






