గంగదేవి గుట్టకు గండం!
- 36.10 ఎకరాల్లో గుట్ట విస్తీర్ణం
- ఇప్పటికే సుమారు 10 ఎకరాల మేర పూర్తయిన స్వాహా కార్యం
- తుమ్మగూడెం గ్రామపంచాయతీకి కేటాయించిన ఎకరంలో ఏర్పాటు చేసిన బోర్డు మాయం..
- అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు కబ్జాదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు అంటూ ప్రచారాలు
- గుట్ట భూమిని కాపాడాలంటూ స్థానికుల వేడుకోలు
మోతె, జూలై 19 : రోజురోజుకు వ్యవసాయ భూముల విలువ పెరుగుతుండడం తో మనిషిలో ఉన్న స్వార్థ బుద్ధి రాను రాను మరింత పెరుగుతోంది. దీంతో అందిన కాడికి పక్కనున్న వారి భూమిని కలుపుకోవడమో,కాకుండా దౌర్జన్యంగా ఆక్రమించడ ము చేస్తుండడంతో వివాదాలు సైతం పెరుగుతున్నాయి.
ఇక పక్కన ప్రభుత్వ భూమి ఉంటే చాలు అందిన కాడికి ఆక్రమించడమే వారివంతవుతుంది. ఇదే విధానం మండలంలోని ఉర్లుగొండ రెవెన్యూ గ్రామ పరిధిలో గల తుమ్మగూడెం సమీపంలో గల గంగదే వి గుట్ట విషయంలోనూ ఇదే జరుగుతుంది. గుట్ట పక్కన ఉన్న భూములు గల వారు ఆక్రమించడమే కాకుండా భూములు లేని వారు, ఇతర గ్రామాలకు చెం దిన వారు అవకాశం ఉన్నకాడికి ఆక్రమిస్తుండడంతో గంగ దేవి గుట్టకు గండం వాటిల్లుతుందని స్థానికులు చెబుతున్నారు.
అందినకాడికి ఆక్రమణ
తుమ్మ గూడెం సమీపంలో గల గంగదేవి గుట్ట 36 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ఉన్నట్లు రికార్డులలో నమోదయింది. అయి తే దీనిలో చుట్టూ భూములు ఉన్న వారు, ఇ తర కబ్జాదారులు ఇప్పటికే సుమారు 10 ఎ కరాల మేర ఆక్రమించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మిగిలిన భూమిలో కూ డా ఇప్పటికీ కొందరు స్వార్ధపరులు దాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
తుమ్మగూడెం గ్రామపంచాయతీకి ఎకరం భూమి కేటాయింపు
సుమారు 10 ఎకరాల మేర ఆక్రమణకు గురికాగా మిగిలినటువంటి భూమిలో ఎక రం భూమిని వివోఏ బిల్డింగ్, ఫుడ్ గ్రీన్ గో డౌన్ నిర్మించేందుకు గాను తుమ్మ గూడెం గ్రామపంచాయతీకి అధికారులు కేటాయించారు. అయితే దీనికి కొంతకా లం హద్దులు పెట్టకపోవడంతో కొంతమం ది కబ్జాదా రులు ఆక్రమిస్తున్నారనే విష యం బయటకు రావడంతో అధికారులు వెంట నే వెళ్లి హద్దులు నిర్ణయించి అక్కడ గ్రామపంచాయతీకి కేటాయించబడిన భూమి అని బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.
మాయమైన బోర్డు..
తుమ్మ గూడెం గ్రామపంచాయతీకి రెవె న్యూ అధికారులు ఎకర భూమిని కేటాయించగా గత శుక్రవారం రోజున అధికారులు హ ద్దులు నిర్ణయించడంతో ఆ గ్రామపంచాయతీ సర్పంచ్, జిపిఓ, పంచాయతీ కార్య దర్శులు రెవిన్యూ అధికారుల సమక్షంలో బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఆరోజు రాత్రి కొందరు స్వార్ధపరులు తాము కబ్జా చే స్తున్న భూమిపై ఇలా ఏర్పాటు చేస్తున్నారన్న అక్కసుతో రాత్రికి రాత్రి బోర్డును మాయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అధికారులు తీరుపై అనుమానాలు
గుట్ట మొత్తం విస్తీర్ణం 36 ఎకరాల 10 గుంటలు అయినప్పటికీ గతంలోనే సుమా రు 10 ఎకరాల మేర కబ్జాకు గురైనప్పటికీ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో గతంలోనే వారిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇటీవల కాలం లో కొందరు కబ్జాదారులు గంగదేవి గుట్ట భూమిని పట్టపగలే బ్లాస్టింగ్ లు చేయడంతో పాటు బుల్డోజర్లు పెట్టి చదును చేయించిన వారిని గుర్తించి వారిపై కనీసం పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయలేదని స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులకు, పంచాయతీ అధికారులకు కబ్జా దారులు ముట్ట చెబుతున్న ముడుపుల తోనే ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికంగా వార్తలు వెలువడుతున్నాయి. పలువు రు అధికారులు కబ్జాకోరులతో చేతులు కలపడం ఫలితంగానే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు స్థానికంగా బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న జిల్లా అధికారుల సైతం స్పందించకపోవడంతో వారి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండదండలు
గంగదేవి గుట్ట భూమిని ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తుమ్మ గూడెం గ్రామానికి వలస వచ్చి అక్కడే ఉంటూ గుట్టలోని సుమారు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి చదును చేసి దానిలో పేసర్లు చల్లగా అవి ఇప్పటికే మొలకెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న మండల అధికారులు మాత్రం దాని గురించి ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే కబ్జా&






