5 June, 2026 | 12:58 AM

కార్మిక, కర్షకుల సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం..

05-06-2026 12:00 AM

సీతంపేటలో సీఐటీయూ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు 

ముత్తారం, జూన్ 4 (విజయక్రాంతి): మండలంలో ని సీతంపేట గ్రామంలో లో సిఐటియు రైతు, వ్యవసా య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘కార్మిక-కర్షక స్థితిగ తులు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడంతో స్థానిక కూలీలకు పని దొరకడం లేదని, దీనివల్ల వారు వలస కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న మార్పుల (జిరాంజి) వల్ల కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని కోరారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లు..

రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చి, వారిపై ఆర్థిక భారం వేయడం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. రైతాంగానికి సాగులో గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణిసది, మాజీ ఉపసర్పంచ్ ఓదెలు, కార్మిక సంఘం నాయకులు ఇందారపు ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, హమాలీ సంఘం నాయకులు  బుచ్చన్న, రమేష్తో పాటు పలువురు వ్యవసాయ కార్మికులు దుర్గయ్య, కొమురయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.