కాంగ్రెస్ నిరుద్యోగులను వంచింది
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
గడ్డిఅన్నారం డివిజన్‌లో నిరుద్యోగుల వంచన సభ
ఎల్బీనగర్, జూన్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచింది మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల వంచన సభ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, రాకేశ్ రెడ్డి గారు, అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో 29, జీవో 46లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
ఉద్యోగం యువత హక్కు వంచన ఇక చాలు అనే నినాదంతో నిరుద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
తక్షణమే పది వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్ గారు, గండి సన్నీ యాదవ్, నిరుద్యోగుల జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, కుమార్, ఆకాష్, శంకర్, శంబు, నవీన్, ఉపేందర్, సింధు, విక్రమ్, దామోదర్ రెడ్డి, అశోక్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.






