calender_icon.png 7 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం

07-12-2025 12:00:00 AM

  1. ఆయన బాటలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలన
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : తెలంగాణ స్వరాష్ర్టం సాధించు కోవడానికి రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలన సాగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నివాళులు అర్పించారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ర్ట సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. 

మహనీయుడు అంబేద్కర్: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన మహనీయు డు అంబేద్కర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం ఆయన చేసిన పోరా టం మరువలేనిదని, గుర్తు చేశారు. వారి స్పూర్తి ప్రస్తుత, భవిష్యత్ తరాలకు అందించేలా కెసిఆర్ గారు రాష్ర్ట సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి, 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారని తెలిపారు. బాబా సాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.