calender_icon.png 10 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల ఆశయాల సాధనకు పునరంకితమవుదాం

10-11-2025 12:00:00 AM

* సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

సుజాతనగర్/కొత్తగూడెం , నవంబర్ 9,(విజయక్రాంతి):పేదవర్గాల అభ్యున్నతికోసం, పార్టీ విస్తరణకు నిరంతరం కృషిచేసిన అమరుల ఆశయాల సాధనకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పునరంకితం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాం బశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ, ఏఐకేఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు భా గం కేశవరావు సంతాప సభ మండలంలోని కేశవరావు స్వగ్రామం కొత్త అంజనాపురం గ్రా మంలో ఆదివారం జరిగింది. సంతాపసభకు ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తదితరులు కేశవరావు చిత్రపటానికి పూలమాలవేసి నివా ళుల ర్పించారు.

అనంతరం జరిగిన సంతాపసభలో కూనంనేని మాట్లాడుతూ సుజాతనగర్, పరిసర ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు కేశవరావు యెనలేని కృషిచేశారని, అనేక ప్రజా, రైతు ఉ ద్యమాలు నిర్మించి సమస్యల పరిస్కారంకోసం శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకుడిగా ప్రతి పోరాటంలో అగ్రభాగాన నిలిచాడని కొనియాడారు. అయన ఆశయాలు సాదించేందుకు నేటితరం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా దస్రు, మండల కార్యదర్శి కొమారి హన్మంతరావు, జిల్లా సమితి సభ్యులు జక్కుల రాములు, తాళ్లూరి పాపారావు, భాగం కృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.