calender_icon.png 10 November, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడకతో సంపూర్ణ ఆరోగ్యం

10-11-2025 12:00:00 AM

ఇంటెలిజెన్స్ సీఐ కిషన్ 

మేడిపల్లి, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రతిరోజు క్రమం తప్పకుండ  వ్యాయామం, వాకింగ్ చెయ్యాలని తద్వార ఎటువంటి వ్యాదులబారిన పడకుండ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు అని శాంతివనం రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఇంటలిజెన్స్ సీఐ కిషన్ అన్నారు. ఆదివారం చెంగిచర్ల శివారులోని శాంతివనంలో వాకర్స్ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. తాను ప్రతి రోజు ఉదయం పది కిలోమీటర్ల రన్నింగ్, లేదా 11 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేస్తానని ఫలితంగా ఎంత ఒత్తిడి ఉన్న ఎటువంటి ఇబ్బందులు లేకుండ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.

  2021నుంచి ఇప్పటి వరకు పది మారథాన్ పోటీలలో పాల్గొని పతకాలు సాదించానని, ఇప్పుడు మరిన్ని మారథాన్లలో పాల్గొనడానికి సిద్దంగ ఉన్నానని చెప్పారు. చిన్నాపెద్దా తేడా లేకుండ ప్రతి వ్యక్తి ఉదయమే నిద్రలేచి కనీసం ఒక గంట సమయం వాకింగ్, రన్నిం గ్, వ్యాయామం, యోగా వంటివి చెయ్యాలని తద్వార ఆరోగ్య భారత్ ను  నిర్మిం చుకోవచ్చని సూచించారు. ఈ సందర్బంగా శాంతివనం రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యమంలో కిషన్ కు అబినందనలు తెలిపారు.