calender_icon.png 10 November, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంత వరకూ విస్తృత పోరాటాలు

10-11-2025 12:00:00 AM

15న చలో అచ్చంపేట ఆదివాసి 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ వెల్లడి

ఖమ్మం, నవంబర్ 9 (విజయ క్రాంతి) : ఎస్టీ జాబితా నుండి వలస లంబాడీలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసి 9 తెగల కార్యచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం బల్లేపల్లి లోని జేఏసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంతవరకు జేఏసీ జెండా, ఎజెండా ఒకటేనన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చెంచు తెగల సహకారంతో ర్యాలీ సభ నిర్వహిస్తామన్నా రు. అనంతరం ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లందు బొగ్గుట్టలో, డిసెంబర్ 4న చిరుమళ్ళలో విస్తృత సన్నాహక సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న ఆసిఫాబాదులో జరిగే బహిరంగ సభకు రాజకీయాలకతీతంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ మైదాన ప్రాంత సమాజాన్ని పక్కదోవ పట్టించేందుకు పలువురు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. లంబాడీల కుట్రలను తిప్పికొడతామన్నారు.

అనంతరం చలో అచ్చంపేట, బొగ్గుట్ట, చిరుమళ్ళ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆధా ర్ సొసైటీ అధ్యక్షులు కల్తీ వీరమల్లు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక విజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధ బోయిన లక్ష్మీనారాయణ, ఆదివాసి మహిళా చైతన్య శక్తి చైర్మన్ పూసం వెంకటలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షులు కురసం పద్మజ, ఆర్టిఐ డేటా కమిటీ చైర్మన్ బట్టు వెంకటేశ్వర్లు, నల్లమల్ల చెం చుల ప్రతినిధి కాట్రాజు శ్రీను, జేఏసీ నాయకులు కుర్సం సీతారాములు, ముక్తి భాస్కరరావు, చిగుర్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.