9 August, 2026 | 3:05 PM

కొమరం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం: ఎంపీ

09-08-2026 01:58 PM

సోనాల: కొమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎంపీ ఈ నగేష్ పేర్కొన్నారు. ఆదివారం సోనాల మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులమైన మనం చదువుకొని అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాలను కట్టుబాట్లను మరువకుండా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కార్యక్రమంలో రాయి సెంటర్ల సార్ మెడిలు వివిధ గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు.