9 August, 2026 | 2:58 PM

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ : ఎమ్మెల్యే గండ్ర

09-08-2026 01:55 PM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 09 (విజయక్రాంతి) : దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో ఆదివారం యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతున్న సంస్థ యూత్ కాంగ్రెస్ అని అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు సమాన అవకాశాల కోసం యూత్ కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి యువ కాంగ్రెస్ కార్యకర్తకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ ఛైర్మెన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, పట్టణ కమిటీ, యూత్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.