నిర్మల్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
03-04-2026 01:05 AM
నిర్మల్ ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 42 వార్డులో ప్రభుత్వపరంగా అభివృద్ధి నిధులను ఖర్చు చేసి అభి వృద్ధి మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య అన్నారు. గురువారం పట్టణంలోని 36 37 వార్డులో పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని వార్డులు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ఈ ప్రణాళిక ఉపయోగ పడుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టీపీవో హరీష్, డీ ఈ హరిభువన్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.




