29 July, 2026 | 1:17 AM

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం

29-07-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)జూలై 28:తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలుకు అండగా నిలిచి,కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటుబడిన అభివృద్ధిని కాం గ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లలో సుమారు రూ.2వేల కోట్లతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు.

రానున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ సైనికుల వలే సమిష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుందని,చిన్నచిన్న విభేదాలు వచ్చినా నాయకులంతా కలిసి చర్చించి ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పనిచేసి పార్టీ బలోపే దానికి కృషి చేయా లని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమ య్య,సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్,పాశం కరుణాభాస్కర్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు సైదులు, జలేంధర్,నాయకులు పాలెల్లి సురేష్,నర్సింగ వెంకటేశ్వర్లు,చిక్కుల శేఖర్,మనోహర్,సత్యం ఎడ్ల సైదులు,నాగేందర్,వజ్జె రవి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.