ఆదమరిస్తే.. అపాయమే..!
గంభీరావుపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్లే కామారెడ్డిసిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వాగు పక్కన ఉన్న లో లెవెల్ వంతెన వద్ద కల్వర్టు కూలిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.ఈ దారిలో ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వాహనదారులు కాస్తునా అదుపు కోల్పోతే కాలువ గుంతలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.ఏళ్లుగా ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పందించి కూలిపోయిన కల్వర్టును మరమ్మతు చేసి రహదారిని సురక్షితంగా మార్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.






