17 April, 2026 | 2:41 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వర్గ విభేదాలు వీడుదాం..!

13-10-2025 12:48 AM
  1. కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేద్దాం

పోచారం, ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరుల తీర్మానం 

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేటట్లు ఉండే వర్గ పోరు కు కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పుల్ స్టాప్ పెట్టారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు గ్రూపులకు స్వస్తి పలుకుదామని గ్రామ పెద్దల సమక్షంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఏర్కూరు మొగలయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కులకర్ని సురేష్ బాబా మాట్లాడుతూ ఇక వర్గ పోరుకు స్వస్తి పలుకుదాం, అందరం కలిసి కట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని సమావేశంలో తీర్మానించారు.

వర్గ పోరును పక్కన పెడదాం, కల్సికట్టుగా పనిచేసే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేద్దామని అన్నారు. ఈ సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి కోసం అందరూ పాటుపడాలని సమావేశంలో తీర్మానించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఒకటి కావడం నియోజకవర్గంలో చర్చని అంశంగా మారింది. వర్గ పోరు ఉండడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలు అయ్యే అవకాశాలు ఉంటాయని భావించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వర్గ పోరును పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేద్దామని సమావేశంలో తీర్మానం చేయడంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకటయ్యారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డిలు చెప్పిన ఆదేశాల మేరకే ఒకటయ్యారా లేక స్థానికంగా ఉన్న నాయకులు ఒకటయ్యారా అనేది భవిష్యత్తు లో జరిగే ఎన్నికల్లో వారు అవలంబించే తీరే తేట తెల్లం కానుంది. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, రుద్రూర్ మండలాలే కాకుండా మిగతా బీర్కూరు, నసురుల్లాబాద్, పోతంగల్, కోటగిరి, మండలాల కాంగ్రెస్ నేతలు ఒకటైతారా లేద వేచి చూడాల్సిందే మరి.