calender_icon.png 13 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్కలు కొనలేని దిక్కుమాలిన ప్రభుత్వం

13-10-2025 12:48:51 AM

-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల వేతనం పెండింగ్ 

-ఎక్స్‌సర్వీస్‌మెన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా 

-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మార్కెట్లోకి రైతులు మొక్కలు తీసుకొచ్చిన కొనుగోలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం పై రైతులు మండిపడుతున్నారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండటం అత్యంత బాధాకరమన్నారు.

భార్యకు బస్సు ఫ్రీ అంటూ భర్తకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంపై ప్రాధాన్యత తగ్గించిన ప్రభుత్వం ఆస్పత్రులు అధ్వానంగా మారాయని విమర్శించారు. కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు బందు చేసి రోగులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవానికి హరీష్ రావు హాజరై మాట్లాడారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించిన రక్షకులకు రాష్ర్టంలో సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎక్స్ సర్వీస్ మెన్ సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని వెల్లడించారు. సిద్దిపేట వాసవి క్లబ్ నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.