17 April, 2026 | 2:55 AM

కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం

17-04-2026 12:50 AM

ఎమ్మెల్యే గంగుల పిలుపు

కరీంనగర్, ఏప్రిల్16(విజయక్రాంతి):ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో జరుగబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభకు కరీంనగర్ నుండి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు.. ప్రజలను తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసేందుకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన నియోజవర్గ ముఖ్య నాయకులతో నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నాయకులకు పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు.

సభకు ఏ గ్రామం నుండి ఎంత మంది తరలివస్తున్నారు.. పట్టణం నుండి ఎంత మంది రానున్నారు. వారికోసం రవాణా బోజన సదుపాయాల నిర్వహణ ఏవిధంగా చేయాలనే విషయాలను కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ...తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలకు రానున్న సందర్భంగా బారస కార్యకర్తలే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

జగిత్యాల సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లహరిశంకర్ , కార్పొరేటర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు మాజీ ప్రజా ప్రతినిధులు.. ఆయా మండల శాఖ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు మైనార్టీ విభాగం నాయకులు , గ్రామ శాఖ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.