పేదల సంక్షేమమే ప్రజా పాలన ప్రణాళిక క్ష్యం
కోనరావుపేట ఏప్రిల్ 16 (విజయక్రాంతి):పేద ప్రజలకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో మచ్చ గీత తెలిపారు.కోనరావుపేట మండల కేంద్రంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మం డల సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దడం,
కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహాలు, గృహ జ్యోతి, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ద్వారా పేదలు, రైతులకు సహాయం అందుతున్నదని తెలిపారు. రైతులు పండించిన పంటల కు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయా ణం, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వివరించారు.
అలాగే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీడీ ఎస్, వ్యవసాయ, హార్టికల్చర్, స్వశక్తి మహి ళా సంఘం తదితర విభాగాల స్టాళ్లు ఏర్పా టు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలకు అందుతున్న సంక్షే మ పథకాలపై ఐకేపీ సిబ్బంది వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్త్స్ర ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అరైవ్ లైవ్ కార్యక్రమం కింద రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలకు కలిగే న ష్టాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరల క్ష్మి, ఎంపీడీవో నటరాజ్, అన్ని గ్రామాల స ర్పంచులు, మార్కెట్ చైర్మన్ గచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, ఎస్త్స్ర ప్రశాంత్ రెడ్డి, మండల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






