12 May, 2026 | 11:16 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ట్రంప్-మోదీ ఫోన్ కాల్: హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ — శాంతికి భారత్ మద్దతు

25-03-2026 12:00 AM
  1. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ 
  2. శాంతి పునరుద్ధరణకు భారత్ సంపూర్ణ మద్దతు
  3. జలసంధి గుండా సురక్షిత ప్రయాణాలు అత్యవసరమన్న మోదీ
  4. ఇరాన్‌లోని అజ్ఞాత వ్యక్తితో సంప్రదింపుల్లో ఉన్నామన్న ట్రంప్

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే ప్రాముఖ్యతపై చర్చించారని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు. ఇరువురి మధ్య పశ్చిమాసియా లో ని పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు.

వీలైనంత త్వరగా ఉద్రిక్తతల ను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందని వివరించారు. హోర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షి తంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాల గురించి సంప్రదింపులు కొనసాగించడాన్ని భారత్ అంగీకరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల అనంత రం తొలిసారిగా ట్రంప్ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. సోమవారం ఐదురోజు ల యుద్ధ విరమణ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాంతినెలకొల్పేందు కు ఇరాన్‌లోని అజ్ఞాత, అత్యున్నత భా వాలు కలిగిన వ్యక్తితో తాము సంప్రదింపుల్లో ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ నాయకు డు మొజ్తాబా ఖమేనీ కాదన్నారు.

కాగా ఆ వ్యక్తి ఇరాన్ పార్లమెంట్ అధ్యక్షుడు మహమ్మ ద్ బాగేర్ అయి ఉంటాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇటీవల అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగాచ్చీలు ఇటీవల ఫోన్ లో నేరుగా సంభాషించినట్లు తెలుస్తుంది.