12 July, 2026 | 5:49 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

పెదాలను కాపాడుకుందాం..అసలే చలికాలం..

04-12-2024 03:36 AM

 ఈ సీజన్‌లో పెదాలు ఎక్కువగా పగిలి ఇబ్బంది కలిగిస్తాయి. ఆ బాధ నుంచి బయటపడాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. 

* కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తుంది. ఇది కొవ్వు ఆమ్లా లను కలిగి ఉంటుంది. ఈ నూనె చర్మా న్ని హైడ్రేట్‌గా, మృదువుగా ఉంచడం లో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పెదాల కు రాసుకుని పడుకుంటే సరిపోతుంది. 

* పెదాలు పగిలిపోతే.. కొద్దిగా వాసెలిన్‌లో తేనె కలిపి పెదాలకు రాసు కుంటే.. మృదువుగా మారతాయి. ఈ మిశ్రమాన్ని పెదవులపై 10 నిమిషాలు అప్లు చేసి, ఆపై మెత్తటి దూదితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజుకు ఒకసారి చేస్తే అందమైన పెదాలు సొంతమవుతాయి. 

* పెదాలు పొడిబారి చికాకు తెప్పిస్తాయి కొందరికి.. అలాంటివారు గ్రీన్ టీ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. టీ బ్యాగ్ ను గోరు వెచ్చని నీటిలో వేసి పెదవులపై పూయాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

* పెదాలకు తరచూ మాయిశ్చరైజర్ చేసుకోవాలి. పెట్రోలియం మాయిశ్చరైజర్లు ఈ కాలం వాడకపోవడమే మంచిది. ఇవి స్వేద రంధ్రాలను కప్పి వేడిని పెం చుతాయి. వీటికి బదులుగా తేమ అధికంగా ఉండే బాదం, కొబ్బరి నూనెలు సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. దురద లాంటివి ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడొచ్చు. 

* శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు పెదాలు తడి ఆరిపోయి వాటిపై చర్మం లేచిపోతుంది. దీనిని తీసే ప్రయత్నం చేసినప్పుడు పుండ్లు పడి రక్తస్రావం జరుగుతుంది. శరీరాన్ని నిరంతరం హై డ్రేట్‌గా ఉంచుకోవాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్లు, నీరు ఎక్కువగా ఉండే కూ రలు ఆహారంలో భాగం చేసుకోవాలి. 

* బొబ్బలతో నొప్పిగా ఉంటే కలబంద గుజ్జు రాయడం వల్ల ఉపశమనం పొందొచ్చు. ఇంట్లో కలబంద మొక్క నుంచి ఆకును కత్తిరించి దాని గుజ్జు తీసి పెదాలకు రాసుకోవచ్చు. లేదంటే కలబంద మిశ్రమంతో చేసిన క్రీమ్‌లను వాడొచ్చు.