23-04-2025 12:00:00 AM
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికు లందరికీ కనీస వేతనం, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 తేదీన చేపడుతున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాల ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ లో మంగళవారం నిర్వహించిన కార్మిక సం ఘాల జిల్లా స్థాయి సమ్మె సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేం ద్రంలో బీజేపీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చినదన్నారు.
దేశ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పదుతోందని ఆరోపించారు. మరోవైపు ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సం స్థలన్నింటిలో వాటాలను విక్రయిస్తూ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేస్తున్నదని మండి పడ్డారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేసిందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను దూరం చేసిందన్నారు.
ఆశ, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు, ఐకేపీ వివోఏలు, ఇతర రంగాల కార్మికులు దేశ వ్యాప్తంగా కనీస వేతనాల కోసం ఉద్యోగ భద్రత పెన్షన్ ఇన్సూరె న్స్ లాంటి సౌకర్యాల కోసం పోరాటాల నిర్వహిస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును దూరం చేసి, 12 గంటల పని దినా న్ని చట్టబద్ధం చేసి కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు చట్టాలలో మార్పులు చేసి లేబర్ కోడ్ల రూపంలో తీసుకువచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, కార్యదర్శి రాజ న్న, సీఐటీయూ అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకట్ నారాయణ, ఐఎఫ్‌టీయూ నేత జగ సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమన్న, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా కార్యదర్శి కిరణ్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అశోక్, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు తదితరులు పాల్గొన్నారు