calender_icon.png 4 May, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఘోరి అరెస్ట్

23-04-2025 12:00:00 AM

యూపీలో అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు

చేవెళ్ల, ఏప్రిల్ 22 : కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి (శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అలియాస్ శ్రీనివాస్)ని మోకిలా పోలీసు లు అరెస్ట్ చేశారు.  పూజల పేరుతో ఓ మహిళను చీటింగ్ చేసిన అఘోరిపై మోకిలా పీఎస్‌లో కేసు నమోదైన విష యం తెలిసిందే. 

దీనిపై ఇప్పటికే దర్యా ప్తు చేపట్టిన పోలీసులు...  ఐదుగురు బృందంగా వెళ్లి మంగళవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అదు పులోకి తీసుకున్నారు.  ఆమెతో పాటు ఇటీవల పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయాన్ని  పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  

 ఇదీ కేసు

శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు రెవెన్యూలోని ప్రగతి రిసార్ట్లో నివసిస్తున్న వినితా బీటీ అనే మహిళ ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు లేడీ అఘోరిని సంప్రదించింది.  ఇందుకు రూ.9.80 లక్షలు కావాలని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఒప్పం దం ప్రకారం డబ్బులు చెల్లించిన తర్వా త మరిన్ని డిమాండ్ చేయడంతో విని తా ఫిబ్రవరిలో మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు దర్యాప్తు ఉండగానే... అఘోరి ఏపీకి చెందిన వర్షిణిని ప్రేమ పేరుతో తన వెంట యూపీకి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.  కుటుంబ సభ్యులు పోలీసుల సాయం తో ఇంటికి తీసుకొచ్చినప్పటికీ..  కొన్నాళ్లకే అఘోరి వర్షిణిని కేధార్ నాథ్ తీసు కెళ్లి వివాహం చేసుకుంది. దీంతో వీరిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడంతో తాము తెలుగు రాష్ట్రాలకు రాబోమని, కేదార్నాథ్ వెళ్తున్నామని ప్రకటించారు. 

అంతేకాదు తమకు అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వారం కింద వీడియో కూడా రిలీజ్ చేశారు.  ఈ ప్రకటననే ఆధారం గా చేసుకున్న పోలీసులు... అఘోరి ని పట్టుకునేందుకు ఒక ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్,  ఒక మహిళా కానిస్టేబుల్... ఐదుగురు బృం దంగా ఏర్పడ్డారు. లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేస్తూ వెళ్లారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు.