calender_icon.png 10 July, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

10-07-2025 12:48:15 AM

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే 

జుక్కల్, జూలై 8 (విజయ క్రాంతి), తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్,  డోంగ్లి మండలాల టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ  త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల పాలనలో ఏం చేసిందో కార్యకర్తలు నిలదీయాలన్నారు.

మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష వెయ్యి పది రూపాయలతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదు ప్రశ్నించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఈ విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు తెలిపాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. కష్టపడ్డ వారికి విజయం కూడా వరిస్తుందని అన్నారు.

పిట్లం మండలం తిమ్మా నగర్ వద్ద బ్రిడ్జి నాహాయంలో ప్రారంభమైతే నేను సాక్ష్యం చేశాను అని చెప్పడం అలాగే డోంగ్లి బిచ్కుంద రోడ్డు నిర్మాణం చేపడితే మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి  కాంగ్రెస్ నాయకు లు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ప్రజలందరికీ ఎవరు మంజూరు చేశారు ఎవరు పనులు చేయించారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల అధ్యక్షులు బన్నీ పటేల్ డోంగ్లి మండల అధ్యక్షులు విజయ పటేల్ సొసైటీ మాజీ అధ్యక్షులు వాగ్మారే మారుతి తదితరులు పాల్గొన్నారు.