calender_icon.png 10 July, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులను హరిస్తున్న కేంద్రం

10-07-2025 12:42:19 AM

- కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్’పై తిరగబడాలి 

- ప్రైవేటీకరణ ముప్పు నుంచి ప్రభుత్వ సంస్థలను రక్షించుకుందాం

- విపక్షాల జిల్లా నేతలు ఎస్ కె సాబీర్ పాషా, మచ్చ వెంకటేశ్వర్లు , జలీల్ 

- కొత్తగూడెంలో భారీర్యాలీ..  విజయవంతమైన సార్వత్రిక సమ్మె

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (విజయ క్రాంతి); కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మి క, కర్షణ, ప్రజా హక్కులను కాలరాస్తూ పా లనా సాగిస్తోందని, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, చట్టాలు అన్నివర్గాలకు గుదిబండగా మారుతున్నాయని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు జలీల్,మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బి క్షం, న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులు గౌని నాగేశ్వరరావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ కా ర్మిక, ప్రజా వ్యతిరేఖ విధానాలు, కార్మికచట్టాల సవరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, అ సోసియేషన్లు, ఫెడరేషన్ల ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటీ రంగ సంస్థల కా ర్మికులు, ఉద్యోగులు బుధవారం స్వచ్చందం గా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె సందర్బంగా పట్టణంలోని పాత డిపో సెం టర్ నుంచి బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడారు.

ఐదు దశాబ్దాల క్రితం పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు, కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులుగా మార్చివే సిందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులు పనిగంటలు పరిమితి హక్కు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, కనీసవేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఎనిమిది గంటల పనివిధానాన్ని ర ద్దు చేసి శ్రమ దోపిడీకి కేంద్రం తెరలేపిందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం ద్వా రా 200 రోజులు పని కల్పించి, రూ.600 కూలి చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చే స్తుంటే కేంద్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. రైతాంగా వ్యతి రేఖ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన సుదీర్ఘ ఉద్యమం సందర్బంగా స్వా మినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆ హామీలను అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తోందని, ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను పె ట్టువాడిదారీ వర్గాలకు కట్టబెడుతోందని విమర్శించారు.

కేంద్రం తీసుకువచ్చిన జో వో 21తో లక్షలాది మంది మోటారు కార్మికులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నా యని, ధరల భారంతో పేద, మధ్యతరగతి వ ర్గాలు సతమతమవుతుంటే కేంద్రానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. కేంద్రం తీరుకు నిర సనగా జరిగిన సమ్మె విజయవంతమైందని, ఈ సమ్మె కేంద్రానికి గుణపాఠం కానుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు నరాటి ప్రసాద్, చం డ్ర నరేంద్రకుమార్, కంచర్ల జమలయ్య, వం గ వెంకట్, వాసిరెడ్డి మురళి, భూక్యా శ్రీనివాస్, రమణమూర్తి, సిపిఎం, సిఐటి యు నాయకులు ఏజే రమేష్, మధు, భూక్యా ర మేష్, లిక్కి బాలరాజు, న్యూ డిమోక్రసీ, మా స్ లైన్, ఇఫ్టూ, టియుసిఐ నాయకులు సంజీ వ్, మల్లికార్జున్, సారంగపాణి, సురేందర్, యాకుబ్ శావళి, కెచ్చెల రంగ య్య, కందగ ట్ల సురేందర్, ఏఐటీయూసీ నాయకులు గొ నె మని తదితరులు పాల్గొన్నారు.