17 June, 2026 | 1:55 AM

సింగరేణిలో బొగ్గుమాయంపై సీఎంకు లేఖ

17-06-2026 12:58 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): సింగరేణిలో బొగ్గు నిల్వలపై పారదదర్శకత లేదని, అవినీతి జరిగిందనే అంశం తన దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై వార్తా కథనాలు కూడా వెలువడ్డాయని, రాజకీయా పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, సింగరేణి కార్మికులు సైతం తనకు లేఖలు రాశారన్నారు. ఈ క్రమంలోనే దీనిపై స్పష్టత కోరుతూ తాను సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు.

మంగళవారం జాతీయ మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణిలో బొగ్గు అంశంపై మాట్లాడారు. 50 ఏళ్లుగా సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుందన్నారు. సింగరేణిపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏ అంశంలోనూ లేదన్నారు. సింగరేణిలో బొగ్గు మాయమైందని తన దృష్టికి వచ్చిన అంశంపై విచారణ జరిపించాలని తాను లేఖలో సీఎంకు వివరించినట్లు తెలిపారు. సింగరేణి అంశంలో కేంద్రాన్ని విమర్శించే అధికారం బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో సింగరేణిని నష్టాల్లో ముంచిందని, రూ.30 వేల కోట్లకుపైగా సింగరేణికి బకాయిపడిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడది రూ.56 వేల కోట్లకు చేరిందన్నారు. ఇది కూడా తాను సీఎంకు రాసిన లేఖలో వివరిం చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.