calender_icon.png 14 January, 2026 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వినియోగదారులకు శుభాకాంక్షల లేఖలు

14-01-2026 01:06:28 AM

మంచిర్యాల, జనవరి 13 (విజయక్రాం తి) : విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. గృహ జ్యోతి లబ్ధిదారులకు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశ లేఖలను జిల్లాలో అందజేస్తున్నారు. వ్యక్తిగతంగా కలుస్తూ వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను టిజిఎన్పీడీసీఎల్ అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి పంపిణీ చేస్తున్నారు.