14-01-2026 01:05:20 AM
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 1 లక్ష కు 50 నుంచి 60 శాతం సీఎం సహాయనిది నుండి నగదు మంజూరు చేసేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 శాతం నుంచి 25 శాతానికి నగదు శాతాన్ని తగ్గించడం సమంజసం కాదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 5 లక్షల 34 వేల 500 విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే నేరడిగొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజల మేలును ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సహాయనిది మంజూరు శాతాన్ని పెంచాలని అన్నారు. పేదలు ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే అక్కడ అయిన ఖర్చు బిల్లును తన వద్దకు తీసుకురావాలని, అందరికి మేలు జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.