13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

14-01-2026 01:08 AM

సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

నిర్మల్, జనవరి ౧3 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) మామడ మండలం పొన్కల్ గ్రామంలో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నందున, ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సదర్మాట్ బ్యారేజి  ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ, వారికి కేటాయించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి, భద్రత ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారి అనిల్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.ఎ రజాక్, అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు శాఖల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.