10 March, 2026 | 11:07 AM

స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

19-09-2025 12:00 AM

తుంగతుర్తి సెప్టెంబర్ 17: తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ నందు నిర్వహించిన దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య క్యాంపుల నిర్వహణ, 8 వ జాతీయ పోషణ మాస ప్రారంభం( సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు) కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు గ తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్  అధ్యక్షత వహించిన.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ  సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ నందు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్ కు  ఆయా వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండి వారికి వైద్య సదుపాయం అందిస్తారని తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ పరిధి నందు ఉన్న వివిధ మండలాల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరినారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉపేందర్,డాక్టర్ మణిదీప్ డాక్టర్ వీణ,నర్సింగ్ సూపరిండెంట్ అరుణ,హెడ్ నర్స్ సింగం సువర్ణ,నర్సింగ్ ఆఫీసర్స్,పారా మెడికల్, స్టాఫ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.