ముగ్గురికి యావజ్జీవం
కుటుంబం హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): భార్య, అత్తమామలు, బావమరుదులతో సహా ఐదుగురిని హత్య చేసిన కేసులో నిందితులు ముగ్గురికి రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన భార్యభర్తలు మహమ్మద్ ఖమరుద్దీన్, సాజిదా బేగం, వారి కుమారులు అబ్దు ల్లా బియాబిని, మహమ్మద్ కిర్మాణి, కుమార్తె వేహా ఆఫ్రీన్ల హత్య కేసులో నిందితులైన నేహా అఫ్రీన్ భర్త సయ్యద్ జహంగీర్, అతని సోదరుడు సయ్యద్ కరీం, బావమరిది జబ్బార్ హుసేన్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. రూ.20 వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో జహంగీర్, అతని కుటుంబసభ్యులు 2010 మే 30న దాడి చేసి భార్య నేహా అహ్రీన్‌తోపాటు ఆమె కుటుంబాన్ని మొత్తం హతమా ర్చారు. ఈ కేసును కింది కోర్టు విచారించి దర్యాప్తును తప్పుపట్టింది. అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ జువ్వాడి శ్రీదేవితో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును రద్దు చేసింది.






