రవీంద్రభారతిలో ‘ఏడు రంగుల జెండా’ పుస్తకావిష్కరణ
14-06-2024 01:09 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): డాక్టర్ అమరవాది నీరజ రచించిన ఏడు రంగుల జెండా పుస్తకావిష్కరణను గురువారం రవీంధ్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలచెలిమి బాలవికాస పత్రిక, దక్కన్ లాండ్ చైర్మన్ మణికొండ వేదకుమార్, నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి పత్తిపాక మోహన్, తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి జుర్రు చెన్నయ్య, సాహిత్య అకాడ మీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ పాల్గొన్నారు.






