04-12-2025 12:24:05 AM
వైద్య, నర్సింగ్ కళాశాలలు.. జోరుగా టిమ్స్ పనులు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సేవల బలోపేతం దిశగా కార్యక్రమాలు చేపట్టింది. గర్భిణులకు అందే వైద్యం నుంచి వృద్ధులకు వచ్చే సమస్యల వరకు ప్రతి రుగ్మతకు ప్రభుత్వాసుపత్రుల్లోనే సేవలు అందిస్తోంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకం, ఆసుపత్రుల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాల సంఖ్యను పెంచడంతో పాటు సీట్లను కూడా పెంచింది.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రా జనర్సింహ జూనియర్ డాకర్ల స్టుఫైండ్ పెం పు మొదలు ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వైద్యారోగ్య రంగం మరింత బలోపేతానికి కృషి చేస్తున్నారు. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెం డేళ్ల కాలంలోనే వైద్యారోగ్యశాఖలో మొత్తం గా 9 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. మరో ఏడు వేల పైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రి య కొనసాగుతోంది.
రాష్ర్టంలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను, ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యార్థం కొత్త హాస్టళ్ల బిల్డింగ్స్‌ను, కొత్తగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీ ఎం, ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిట ల్, మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో వాస్క్యులర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ర్ట, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజా ప్ర భుత్వం నిర్ణయించింది. మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతులకు ప్రజాప్రభుత్వం గాంధీ, పెట్లబుర్జు హాస్పిటల్స్‌లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మహా నగరంలో 3 సూపర్ స్పెషా లిటీ హాస్పిటల్స్ (టిమ్స్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రూ.2 వేల కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి గొ షామహాల్‌లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో గత రెండేళ్లలో వైద్యరంగంలో అ‘ద్వితీయ’ ప్రస్థానం కొనసాగుతోంది.