15 June, 2026 | 1:11 PM

Breaking News

యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •  

కాంగ్రెస్ నాయకులా...! వీధి రౌడీలా...!

18-04-2025 12:00 AM

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. నేషనల్ హెరాల్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పేర్లు చార్జ్షీట్ లో చేర్చడంతో  కాంగ్రెస్ నిరసన చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలోనే కిషన్ రెడ్డి గారిపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం సరికాదని అని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంబ కోణలకు కేరఫ్ అడ్రస్ అని  నిజాలు బయటపడుతుంటే భరించలేని కాంగ్రెస్ నాయకులు రౌడీ ల్లగా ప్రవర్తిస్తూ బిజెపి నాయకులపై, మోదీ పై అశ్లీల  పదజాలంతో దుషించ డాన్ని ఆయన  తీవ్రంగా ఖండిచారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు గుండాలు గా  ప్రవర్తించే వారికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు.

గతంలో బండి సంజయ్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై కూడా బెదిరింపులకు పాల్పడటం కాంగ్రెస్ గుండా రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ ని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ డిమాండ్ చేసారు.