23 July, 2026 | 1:54 AM

జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల

23-07-2026 12:00 AM

నేరేడుచర్ల,జూలై 22 : జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో జాతీయ పతాక ప్రాముఖ్యత, ఆవశ్యకత, గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ షేక్ యూసుఫ్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ బట్టు మధు హాజరై,మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందని,అమరవీరుల త్యాగాలను ప్రతి తరం స్మరించుకుంటూ, జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.

భారతదేశ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, మూలగుండ్ల వెంకటరెడ్డి, పూర్వ అధ్యక్షులు జిలకర రామస్వామి, సభ్యులు బాల వెంకటేశ్వర్లు, గంధం శావయ్య, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, నూకల వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు, వాసపల్లయ్య తదితరులు పాల్గొన్నారు.