11-11-2025 06:25:42 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లకుంట గ్రామంలో ఇల్లు పూర్తిగా కాలిపోయిన బాధ్యతలకు మంగళవారం నాడు చేయూత అందించారు. సోమవారం రాత్రి నల్లకుంట గ్రామంలో కాలిపోయి కట్టుబట్టలతో మిగిలారు. దీంతో పండించిన లయన్స్ క్లబ్ భద్రాచలం వెంటనే నల్లకుంట గ్రామాన్ని సందర్శించి కుటుంబాలకు కిరాణా సామాన్లు కూరగాయలు వంట గిన్నెలు దుప్పట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కమలా రాజశేఖర్, సెక్రెటరీ సిద్ధారెడ్డి లైన్ సూర్యనారాయణ లైన్ నరసింహాచార్యులు పాల్గొన్నారు.