calender_icon.png 11 November, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారి మారిన పేరు మారలేదు

11-11-2025 06:23:08 PM

బెజ్జంకి: మండల స్థాయి అధికారి మారినా గ్రామ పంచాయితీ కార్యాలయంలోని బోర్డుపై పాత అధికారి పేరు అలాగే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం బోర్డులో మారిన మండల ప్రత్యేక అధికారి వరదరెడ్డి పేరే కనిపిస్తుంది,  ఈ స్థానంలో మండల ప్రత్యేక అధికారిగా జడ్పీ డిప్యూటీ సీఈవో భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు గడుస్తున్నా పేరు మారక పోవటం కొసమెరుపు. దీనివల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.