24-05-2025 12:00:00 AM
భద్రాచలం, మే 23 (విజయ క్రాంతి): ఇంటర్ ఫలితాలలో సంచలన మార్కులతో పాటు, ఎంసెట్ ఫలితాలలో ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోని ఉత్తమ ర్యాంకులు సాధిం చి లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థుల హావా జేఈఈ మెయిన్స్ లో కూడా కొనసాగింది. శుక్రవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ బి ఆర్చ్ ఫలితాలలో సైతం లిటిల్ ఫ్లవర్స్ వి ద్యార్థిని అయిన ముత్యాల శ్రీ భాగ్య ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో 513 వ ర్యాంకు, బి ప్లానింగ్ లో 435 వ ర్యాంక్ సాధించి మరో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు.
ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్య సంస్థల డైరెక్టర్ మా గంటి రమేష్ బాబు శ్రీ భాగ్య ను అభినందించి మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఫలితాలలో 993 మార్కులతో సంచనాలను సృష్టించిన మా విద్యార్థులు ఎంసెట్ ఫలితాలు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యుత్తమ ర్యాంకులను సాధించారని అన్నారు జేఈఈ మెయిన్స్ ఫలితాలు సైతం అత్యుత్తమ పర్సంటేజ్ లిటిల్ ఫ్లవర్స్ కే సొంతమని ఆయన ఈ సందర్భంగా స్ప ష్టం చేశారు.
జేఈఈ మెయిన్స్ బి ఆర్చ్ విభాగం సైతం 513 ర్యాంకు సాధించి పరీక్ష ఏదైనా ఉత్తమ ఫలితం మాత్రం లిటి ల్ ఫ్లవర్స్ కే సొంతమని నిరూపించారని కొనియాడారు. ఈ ఫలితాలు తమపై బా ధ్యత మరింతగా పెంచాయని భవిష్యత్తులో ఇంతకుమించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అ న్నారు.
అనుభవం కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సా ధ్యమవుతున్నాయని అన్నారు అనంతరం ముత్యాల శ్రీ భాగ్య కు జ్ఞాపిక ను అందించి తన తండ్రి రాంబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బషీర్ ఉపాధ్యాయులు , సిబ్బంది పాల్గొన్నారు.