24-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే23( విజయ క్రాంతి): కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఇటీవల కొంతమంది వేటగాళ్లు పులిని చంపి దాని చర్మం, గోర్లు హలో అవయవాలను ఓలిచి పాతిపెట్టిన సంఘటనలో ఫారెస్ట్ అధికారులు 16 మందిని రిమాండ్‌కు తరలించా రు.
జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పులిని విద్యుత్ షాక్‌తో చంపి పాతిపెట్టిన ఘటనలో అనుమానితుడైన పెంచికల్‌పెట్ మండలం ఎల్లూ రు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అదుపులో కి తీసుకొని విచారించగా ఆయనతోపాటు మిగతా నిందితులను అదుపులోకి తీసుకొని శుక్రవారం సిర్పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి అనంతలక్ష్మి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించినట్లు ఆయన వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ హెచ్చరించారు.