23-05-2025 11:42:39 PM
ఖమ్మం(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు. సాయుధ తెలంగాణ పోరాట యోధుడు నల్లమల గిరిప్రసాద్ వర్థంతి సభ ఈనెల 24న శనివారం ఖమ్మం రిక్కా బజార్ హైస్కూల్లో జరుగుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పాత బస్టాండ్ సమీపంలో గల గిరిప్రసాద్ విగ్రహాన్ని ముస్తాబు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని సురేష్ కోరారు. ఇదిలా ఉండగా పాత బస్టాండ్ వద్ద గల గిరిప్రసాద్ కాంస్య విగ్రహా సుందరీకరణ పనులను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, కార్పొరేటర్ బిజి క్లెమెంట్ తదితరులు పరిశీలించారు.