calender_icon.png 5 December, 2024 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..

24-09-2024 04:23:09 PM

బ్రతికున్న చేపల కోసం ఎగబడ్డ ప్రజలు..

మహబూబాబాద్,(విజయక్రాంతి): చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..ఖమ్మం నుండి వరంగల్ వెళ్తున్న చేపల లోడు లారీ మరిపెడ మండల కేంద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా చేపలు రోడ్డుపై పడిపోయాయి. చేపలు కుప్పలుగా రోడ్డుపై పడిపోవడంతో, పైగా అవి బ్రతికున్న చేపలు కావడంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాలు అదుపు చేయాల్సి వచ్చింది.