ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
27-06-2024 04:58 PM
గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు వైద్యుల సలహా మేరకు గురువారం ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో పాత ఓమ్నీ వ్యాన్‌ను నడిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ బాత్ రూమ్ లో జారిపడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. అనంతరం యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. కాలు ఆపరేషన్ తర్వాత కర్ర సహాయం లేకుండా నడక ప్రారంభించిన కేసీఆర్ పలు రోడ్‌షోల్లో కూడా పాల్గొన్నారు. మాన్యువల్ కారు నడపాలని వైద్యుల సూచన మేరకు కేసీఆర్ పాత ఓమ్నీ వ్యాన్‌ను తన ఫామ్‌హౌస్‌లో నడిపాడు.






